- కొమ్ముగూడెం గ్రామస్తుల ఫిర్యాదుతో సీడబ్ల్యూసీ అధికారుల విచారణ
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కన్నబిడ్డను తల్లిదండ్రులే విక్రయించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ జులై 12న మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం శిశువుచనిపోయాడంటూ గ్రామంలో, బంధువులతో ప్రచారం చేసింది. కాగా, శిశువు చనిపోలేదని, తల్లిదండ్రులు విక్రయించారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఇటీవల బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ శాఖాల అధికారులతో, సిబ్బందితో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు మహబూబాబాద్ సీడీపీవో శిరీష తెలిపారు.
