హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుఐఎస్ఓ సర్టిఫికెట్లు..ఎండీ గౌతమ్‌ కు అందించిన మంత్రి పొంగులేటి

హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుఐఎస్ఓ సర్టిఫికెట్లు..ఎండీ గౌతమ్‌ కు అందించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నాలుగు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, అవినీతి నిరోధక చర్యలు, సమాచార భద్రత, ఫిర్యాదుల పరిష్కారంలో మెరుగైన విధానాలు పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చేతుల మీదుగా కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం సర్టిఫికెట్లు అందుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై అధ్యయనం చేసిన ఐఎస్ఓ ప్రతినిధుల బృందం వీటిని జారీ చేసింది.

మంత్రి పొంగులేటి మార్గదర్శకత్వంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.  దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన దగ్గర నుంచి ఇండ్ల కేటాయింపు, మంజూరు, బిల్లుల చెల్లింపుల వరకు ఇందిరమ్మ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.10 లక్షల ఇండ్లు పూర్తికాగా, లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.8 వేల కోట్లకు పైగా జమ చేశారు. ఎలాంటి అక్రమాలు,  అవకతవకలకు తావులేకుండా అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టారు. ఐఎస్ఓ సర్టిఫికెట్లు నాణ్యమైన పాలన, పారదర్శకత, జవాబుదారీతనానికి గుర్తింపుగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది.