శశిథరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంచందర్ రావు

శశిథరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంచందర్ రావు
  • పలువురు విదేశీ స్పీకర్లను సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రాకుండా అడ్డుకున్నారన్న శశిథరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ‘భారత్ సమ్మిట్’కు హాజరుకావాల్సిన పలువురి విదేశీ స్పీకర్ల వీసాల రద్దు అంశం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ‘ఎక్స్’వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారితీసింది. విదేశాంగ శాఖ క్లియర్ చేసిన 315 మంది స్పీకర్లలో 115 మందిని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాకుండా అడ్డుకున్నారని, వారి వీసాలు రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుక్రవారం ‘ఎక్స్’లో ఆరోపించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు.

సమ్మిట్ కోసం తాను హైదరాబాద్ చేరుకున్నాకే ఈ విషయం తెలిసిందని, ఇది ఎంతో నిరాశపరిచిందని శశిథరూర్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. ‘ఇంకా బాధపడండి.. ప్రజాస్వామ్య పరిరక్షకుల ముసుగులో ఉన్న భారత వ్యతిరేక శక్తులకు భారత భూమి ఆటస్థలం కాదు’అంటూ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో రిప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.