- ఈనెల 16 నాటికి తుఫాన్‌గా బలపడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో మరో తుఫాన్ పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి. శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం వరకు తుఫాన్‌గా మరింత బలపడుతుందని పేర్కొంది.
ఈ తుఫాన్ పేరును ఆక్వాన్గా నిర్ణయించారు. ఇప్పటికే రెండు వరుస తుఫాన్లతో ఇబ్బందులు పడిన ఏపీ ప్రజలు.. మరో తుఫాన్‌ను ఎదుర్కోబోతున్నారు. ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 21 నుంచి 24 మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కాగా, రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. నాలుగు జిల్లాల్లో 11 డిగ్రీల రేంజ్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
