- సైబర్ టవర్స్ నుంచి నోవాటెల్ రూట్లో ఆంక్షలు
మాదాపూర్: గిగ్ వర్కర్స్ బైక్ ర్యాలీ సందర్భంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ట్రాఫిక్పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం శిల్పకళావేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్వరకు కొనసాగనున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ర్యాలీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు సైబర్టవర్స్నుంచి హైటెక్స్కమాన్, హెచ్ఐసీసీ వరకు కొనసాగనున్నది. దీంతో ఈ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్స్ఉంటాయని తెలిపారు.
డైవర్షన్ రూట్లు ఇవే..
- సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ మీదుగా కొండాపూర్ వైపు వెళ్లే వాహనదారులు సైబర్టవర్స్, యశోద హాస్పిటల్, వసంత సిటీ రోడ్, నోవాటెల్, ఆర్టీఏ జంక్షన్, కొండాపూర్మీదుగా కొత్తగూడకు చేరుకోవాలి.
- సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ మీదుగా బొటానికల్గార్డెన్వైపు వెళ్లే వాహనదారులు సైబర్టవర్స్, ఐకియా రోటరి రైట్‌టర్న్, మీనాక్షి, రోలింగ్‌హిల్స్, రాడిసన్జంక్షన్లెఫ్ట్టర్న్తీసుకుని గచ్చిబౌలి ఫ్లైఓవర్వద్ద యూటర్న్ తో బొటానికల్గార్డెన్వైపు వెళ్లాలి.
- కొత్తగూడ నుంచి సైబర్టవర్స్వైపు వెళ్లే వాహనదారులు కొత్తగూడ జంక్షన్ మీదుగా రాడిసన్హోటల్లెఫ్ట్టర్న్తీసుకుని ఏఐజి మీదుగా ఐకియా రోటరీ లెఫ్ట్టర్న్తో సైబర్టవర్స్వైపు వెళ్లాలి.
- టెక్ మహీంద్రా నుంచి మెటల్చార్మినార్వైపు వచ్చే వాహనాలను సీఐఐ జంక్షన్మీదుగా కొత్తగూడ జంక్షన్లెఫ్ట్ టర్న్తీసుకుని బొటానికల్‌గార్డెన్ వైపు వెళ్లాలి.
కోటి దీపోత్సవంతో ఇందిరా పార్కు పరిసరాల్లో..
ట్యాంక్ బండ్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నుంచి 30వ తేదీ వరకు కోటి దీపోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి జోయల్ డేవిస్ తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఇందిరాపార్క్ చౌరస్తా అశోక్ నగర్ నాలా వరకు అవసరాన్ని బట్టి మళ్లింపులు ఉంటాయన్నారు.
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు ట్రాఫిక్ కు అనుమతి లేదని, ఈ దారిలో వచ్చే వాహనాలను కట్టమైసమ్మ దేవాలయం నుంచి దోబీ ఘాట్, డీబీఆర్ మిల్స్, గాంధీనగర్ టీ జంక్షన్, కవాడిగూడ, సీజీవో టవర్స్, ముషీరాబాద్ చౌరస్తా వైపు వెళ్లాలని సూచించారు. అలాగే అశోక్ నగర్ చౌరస్తా నుంచి కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు ట్రాఫిక్ కు అనుమతి లేదని, ఈ రూట్లో వచ్చేవారు అశోక్ నగర్ చౌరస్తా నుంచి హిమాయత్ నగర్ స్ట్రీట్‌నెంబర్ 9 వైపు వెళ్లాలన్నారు.
