బాలాపూర్ లో టిప్పర్–స్కూటీ ఢీ .. ప్రాణాలు కోల్పోయిన మహిళ

బాలాపూర్ లో టిప్పర్–స్కూటీ ఢీ .. ప్రాణాలు కోల్పోయిన మహిళ

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చర్చికి వెళ్లి తిరిగి స్కూటీపై మల్లాపూర్ లోని ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను టిప్పర్ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో చిట్టెమ్మ(55) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా  ఆమె భర్తకు గాయాలయ్యాయి.

గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు