ఎల్నినోతో ఆలస్యమైనా.. హైదరాబాద్ను వణికిస్తున్న చలి.. 12 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు

ఎల్నినోతో ఆలస్యమైనా.. హైదరాబాద్ను వణికిస్తున్న చలి.. 12 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు
  • గత ఏడాది కన్నా తక్కువే.. 
  • శివారు ప్రాంతాల్లో వేగంగా పడిపోతున్న టెంపరేచర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. నాలుగు రోజులుగా నగరంలో రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. పగటిపూట 30 నుంచి 31 డిగ్రీలు...రాత్రి 12 నుంచి 14 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ సారి టెంపరేచర్లు కాస్త ఎక్కువగానే  ఉన్నాయి. ఎల్​నినో ఎఫెక్ట్​తో ఈసారి వర్షాలు పడకపోగా, చలికాలాన్ని కూడా కాస్త వెనక్కి జరిపింది. వింటర్​ఆలస్యంగానే ఎంటరైనా మెల్లి మెల్లిగా టెంపరేచర్లు పడిపోతున్నాయి.  

తగ్గింది..తుఫానుతో పెరిగింది  

వాతావరణ శాఖ లెక్కల ప్రకారం..నవంబర్ 11న రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో12 డిగ్రీలు, పటాన్‌‌‌‌‌‌‌‌చెరులో12.4 , మౌలాలిలో 13.2, తుర్కయంజాల్‌‌‌‌‌‌‌‌లో 14.3, బేగంపేటలో 16.1, హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో కూడిన చలిగాలులు వీస్తున్నాయి. అయితే..ఏపీ తీరం వైపు కదులుతున్న తుఫాను కారణంగా రెండు రోజులుగా టెంపరేచర్లు కొద్దిగా పెరిగాయి.

 నవంబర్14న మౌలాలిలో 14.1 డిగ్రీలు, బీహెచ్‌‌‌‌‌‌‌‌ఈఎల్, హెచ్‌‌‌‌‌‌‌‌సీయూ ప్రాంతాల్లో 14.6, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 14.8, మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో 15.0, ఉప్పల్, బండ్లగూడలో 15.3, వెస్ట్ మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 15న కూడా చలి ప్రభావం కొనసాగింది. పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని ఐక్రిసాట్ లో 13.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 14, హైదరాబాద్ ప్రధాన వాతావరణ కేంద్రంలో 16.9, హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 17.2, హకీంపేటలో 17.9 డిగ్రీలు నమోదయ్యాయి.  

శివారులో మంచు..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గతేడాది నవంబర్ మధ్యలో ఈ ఏడాది కంటే చలి ఎక్కువగానే ఉంది. గతేడాది నవంబర్14 న సెంట్రల్​వర్సిటీ ప్రాంతంలో అత్యల్పంగా 8.8 డిగ్రీలు, పటాన్‌‌‌‌‌‌‌‌చెరులో 9 , రామచంద్రాపురంలో 10.5, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 10.7, శేరిలింగంపల్లిలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ 15న కూడా పటాన్‌‌‌‌‌‌‌‌చెరులో 9 డిగ్రీలు రికార్డయ్యింది. ఈ సారి వారం నుంచి టెంపరేచర్లు పడిపోతుండగా, గతేడాది కంటే ఎక్కువగానే ఉన్నాయి. సిటీలోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది.  కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. మౌలాలి, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో చలి భరించలేని స్థాయిలో ఉంటోంది.