హైదరాబాద్, వెలుగు: పరిపాలనా జాప్యం కారణంగా 2004 సెప్టెంబర్ 1 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, హైకోర్టు తీర్పులు, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోనూ ప్రత్యేక జీవో జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
