టెక్నాలజీలో ప్రపంచానికి దిక్సూచి కావాలి..భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదగాలి: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

టెక్నాలజీలో ప్రపంచానికి దిక్సూచి కావాలి..భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదగాలి: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్
  • హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌డీఈ 2026, ఎరో ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ 2026 సదస్సులు ప్రారంభం
  • తెలంగాణలో ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​కు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు హామీ

మాదాపూర్, వెలుగు: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికే పరిమితం కాకుండా.. కీలక రంగాల్లో సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదగాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ సంసిద్ధత, స్వావలంబనను బలోపేతం చేసేందుకు నాన్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ) రంగంలో స్వదేశీ సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం 36వ వార్షిక ఎన్‌‌‌‌‌‌‌‌డీఈ 2026 సదస్సు, 15వ అంతర్జాతీయ ఎరో ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ 2026 సింపోజియం ప్రారంభమయ్యాయి. రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించి సావనీర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు డిజిటల్ వెర్షన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

రక్షణ రంగంలో స్వావలంబన కీలకం

రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడం ఆర్థిక లక్ష్యమే కాకుండా వ్యూహాత్మక అవసరమని రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అధునాతన తనిఖీ సాంకేతికతలు, ప్రత్యేక సెన్సర్లు, పరీక్షా పరికరాలు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. క్షిపణులు, విమానాలు, యుద్ధ నౌకలు, అంతరిక్ష నౌకల తయారీలో నాణ్యత, కచ్చితత్వం, విశ్వసనీయత అత్యంత కీలకమని తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ ట్విన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి సాంకేతికతలు ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. ఐఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ విక్రాంత్ స్వదేశీ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణలో ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ సెంటర్ ఏర్పాటు

ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ నిపుణులు తయారీ రంగానికి వైద్యుల్లాంటి వారని మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు కొనియాడారు. ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల్లో కనిపించని లోపాలను గుర్తించి భద్రత, నాణ్యతను నిర్ధారిస్తారని చెప్పారు. తెలంగాణలో 1,500కు పైగా ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగ ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈలు ఉన్నాయని తెలిపారు. 2024-25లో విమానాలు, అంతరిక్ష నౌకలు, వాటి విడిభాగాల ఎగుమతుల విలువ సుమారు రూ.63 వేల కోట్లు కాగా, రాష్ట్ర వస్తు ఎగుమతుల్లో వాటా 29.4 శాతమని వెల్లడించారు. తెలంగాణలో ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

2 వేల మందికి పైగా నిపుణుల హాజరు

ప్రారంభోత్సవంలో ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌టీ జాతీయ ఎన్‌‌‌‌‌‌‌‌డీటీ అవార్డులు-2026 ప్రదానం చేశారు. పరిశోధన, అభివృద్ధి, పారిశ్రామిక సేవలు, శాస్త్రీయ ప్రచురణలు, జీవితకాల సేవలకు గుర్తింపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 17 వరకు జరిగే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి 2 వేల మందికి పైగా నిపుణులు, పరిశోధకులు పాల్గొంటున్నారు. వందకు పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి. పరిశోధనా పత్రాల సమర్పణలు, సాంకేతిక చర్చలు, ప్లీనరీ సెషన్లు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు.