డిసెంబర్ 22న రాష్ట్రస్థాయి మ్యాథ్స్ సెమినార్

డిసెంబర్ 22న రాష్ట్రస్థాయి మ్యాథ్స్ సెమినార్

 

  • పరిశోధన పత్రాలకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఆహ్వానం
  • డిసెంబర్ 10 వరకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 22న హైదరాబాద్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రస్థాయి గణిత సెమినార్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రమేశ్ తెలిపారు. గణిత టీచర్లు, లెక్చరర్లు, పరిశోధకులు, ఎన్జీవోల నుంచి పరిశోధన పత్రాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వేద గణితం, కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ బోధనా పద్ధతులు, స్టెమ్-కోడింగ్, నిజజీవిత సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు అంశాలపై పత్రాలు పంపవచ్చన్నారు.

ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వెయ్యి పదాలకు మించకుండా 4 పేజీలలోపు రూపొందించి డిసెంబర్ 10లోపు సమర్పించాలి. ఎంపికైన వారికే ప్రజెంటేషన్ చాన్స్​ ఉంటుందని, ప్లాజరిజం ఉన్న పత్రాలను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. హార్డ్ కాపీలను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, ఆలియా స్కూల్ కాంపౌండ్, ఎల్బీ స్టేడియం ‘ఈ’ గేట్ ఎదురుగా, హైదరాబాద్-500001 చిరునామాకు, సాఫ్ట్ కాపీలను [email protected]కు పంపాలని సూచించారు.