వేదాంత నుంచి స్వాదీనం చేసుకున్న కంపెనీ
న్యూఢిల్లీ: వివాదాస్పద కాంబే ఆఫ్‌షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ బ్లాక్ (సీబీఓఎస్02) కార్యకలాపాలు, నియంత్రణను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ బ్లాక్ కాంట్రాక్టును పొడిగించకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేదాంత దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో, ఈ ఏడాది జులై 22 నుంచి ఓఎన్‌జీసీ దీనిని తన ఆధీనంలోకి తీసుకుంది.
ఈ పరిణామంతో కాంబే బ్లాక్‌కు సంబంధించిన ఆస్తుల విలువ తగ్గుతుందనే అంచనాలతో కింద 2026–-27 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో సుమారు రూ. 379 కోట్ల నష్టాన్ని వేదాంత ప్రకటించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వేదాంత డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా, విచారణ ముగిసి తీర్పు రిజర్వ్‌లో ఉంది. కాగా, గుజరాత్ తీరంలో ఉన్న ఈ బ్లాక్‌లో గతంలో ఓఎన్‌జీసీకి 50శాతం, వేదాంతకు 40శాతం, ఇన్వెనిర్ పెట్రోడైన్‌కు 10శాతం వాటా ఉండేది.
