టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి బిగ్ షాక్ తగిలింది... చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది ఒంగోలు కోర్టు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించారు బాధితులు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెల్లడించింది ఒంగోలు కోర్టు.
ఈ కేసులో నేరం రుజువు కావడంతో బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష, రూ. 95 లక్షల జరిమానా విధించింది కోర్టు. జరిమానా మొత్తం తో పాటు కేసు విచారణ కోసం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా భరించాలని స్పష్టం చేసింది కోర్టు.
అయితే..గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేశ్ కు కోర్టులు జైలు శిక్షలు విధించినప్పటికీ... ఆయన అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఒంగోలు కోర్టు తీర్పు టాలీవుడ్ వర్గాలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
