ఇక ఇంట్లోనే వాట్సాప్‌ ద్వారా PF బ్యాలెన్స్ చూడొచ్చు.. ఈ నంబర్ సేవ్ చేసుకుంటే చాలు..

ఇక ఇంట్లోనే వాట్సాప్‌ ద్వారా PF బ్యాలెన్స్ చూడొచ్చు.. ఈ నంబర్ సేవ్ చేసుకుంటే చాలు..

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ PF (ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్  ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం, అలాగే కంపెనీ తరఫున కొంత మొత్తం ప్రతినెలా ఈ PF అకౌంట్లో జమ అవుతుంటాయి. ఇలా జమ అయిన డబ్బు ఎంత ఉంది ? ఇప్పటివరకు ఎంత వడ్డీ వచ్చింది ? చివరిగా ఎప్పుడు ఎంత మొత్తం జమ అయింది ? అనే వివరాలు తెలుసుకోవాలంటే చాలామంది EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లడం లేదా ఇతర మార్గాలను ఉపయోగించడం చేస్తుంటారు.

అయితే ఇప్పుడు PF ఖాతాదారులకు ఈ పని మరింత సులభం కానుంది. ఇకపై ఇంట్లో కూర్చునే మీ మొబైల్‌లో వాట్సాప్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అంతేకాదు, మీ PF అకౌంట్లో  జరిగిన లావాదేవీల వివరాలను చూడటంతో పాటు, పాస్‌బుక్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ కొత్త వాట్సాప్ సేవలను తీసుకొచ్చింది. EPFO 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి  ఈ సేవలను ప్రారంభించారు.

ఈ సదుపాయం ద్వారా PF ఖాతాదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,  మొబైల్ నుంచే అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చు. మరి వాట్సాప్‌లో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ? పాస్‌బుక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ? స్టెప్ బై స్టెప్ వివరాలు  తెలుసుకుందాం...

EPFO ప్రత్యేకంగా వాట్సాప్ సేవల కోసం EPFO వాట్సాప్ నంబర్ +91 87964 41800 అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్ ద్వారా PF ఖాతాదారులు వారి అకౌంట్ సంబంధించిన పలు వివరాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేవల ద్వారా:
*మీ PF అకౌంట్లో  ప్రస్తుతం ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు.
*చివరిగా జరిగిన ఐదు PF లావాదేవీల వివరాలు చూడవచ్చు.
*మీ PF పాస్‌బుక్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*ఒకటి కంటే ఎక్కువ PF ఖాతాలు ఉంటే, వాటిలో కావాల్సిన ఖాతాను ఎంచుకోవచ్చు.
*మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ వాట్సాప్ సేవలు కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఉర్దూ వంటి ఇతర భారతీయ భాషల్లో కూడా  ఉన్నాయి.

వాట్సాప్‌లో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీ PF ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సులభమైన స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.

స్టెప్ 1: ముందుగా మీ మొబైల్‌లో +91 87964 41800 అనే EPFO వాట్సాప్ నంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోండి.

ALSO READ : BSNL అదిరిపోయే ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 395 రోజుల వ్యాలిడిటీ..

స్టెప్ 2: ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు సేవ్ చేసుకున్న EPFO నంబర్‌కు మెసేజ్ పంపండి.

స్టెప్ 3: ఆ చాట్‌లో 'Hi' అని మెసేజ్ టైప్ చేసి పంపించండి.

స్టెప్ 4: వెంటనే EPFO అధికారిక వాట్సాప్ ఖాతా నుంచి మీకు  మెసేజ్ వస్తుంది.

స్టెప్ 5: ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. తెలుగు ఉంటే తెలుగు భాషను సెలెక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్ 6: ఇప్పుడు స్క్రీన్‌పై కొన్ని సేవలకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో 'Check Balance' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఆ తర్వాత మీ UAN నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPని వాట్సాప్‌లో ఎంటర్  చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

స్టెప్ 8: మీ UAN నంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ PF ఖాతాలు లింక్ అయి ఉంటే, మీకు సంబంధించిన ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 9: వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ PF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వివరాలు నేరుగా వాట్సాప్ చాట్‌లో కనిపిస్తాయి.

ఇలా మీరు ఎక్కడికీ వెళ్లకుండా, మీ మొబైల్‌లోనే PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లోనే PF పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం 
PF బ్యాలెన్స్ తెలుసుకున్న తర్వాత అక్కడే మీకు మరికొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో 'Download Passbook' అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ PF పాస్‌బుక్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పాస్‌బుక్‌లో మీ PF ఖాతాకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఉద్యోగి వాటా ఎంత జమ అయింది? కంపెనీ వాటా ఎంత జమ అయింది? ఎప్పుడు ఎంత డబ్బు ఖాతాలో చేరింది? వంటి వివరాలను చూడొచ్చు. అంటే PF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఒకసారి, పాస్‌బుక్ కోసం మరోసారి వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మీ PF ఖాతాలో చివరిగా ఎప్పుడు డబ్బులు జమ అయ్యాయి? గతంలో ఐదు సార్లు జరిగిన లావాదేవీలు ఏమిటి ? అనే వివరాలు కూడా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

దీని కోసం  ముందుగా EPFO వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపండి.
మీకు వచ్చే సర్వీస్ మెనూలో 'Last 5 Transactions' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ UANకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయండి.
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ PF ఖాతాను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీ ఖాతాలో ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఒకటి కంటే ఎక్కువ PF ఖాతాలు ఉన్నవారు సరైన  అకౌంట్  ఎంచుకోవడం ముఖ్యం. అప్పుడే మీకు కావాల్సిన ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి
*మీ UAN నంబర్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
*OTP వెరిఫికేషన్ తప్పనిసరి.
*ఒకటి కంటే ఎక్కువ PF ఖాతాలు ఉంటే సరైన మెంబర్ ఐడీని ఎంచుకోవాలి.
*వాట్సాప్‌లో కనిపించే అధికారిక EPFO ఖాతాతోనే చాట్ చేయాలి.
*మీ OTP, UAN వివరాలను గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.

మొత్తానికి.. PF ఖాతాదారులకు EPFO తీసుకొచ్చిన ఈ వాట్సాప్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటివరకు PF బ్యాలెన్స్ తెలుసుకోవాలన్నా, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా వెబ్‌సైట్‌ ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త సదుపాయంతో మొబైల్‌లో వాట్సాప్ ద్వారానే ఈ పనులు చేసుకోవచ్చు.

ముఖ్యంగా టెక్నాలజీపై ఎక్కువ అవగాహన లేని ఉద్యోగులకు కూడా ఈ విధానం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ PF ఖాతా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.