GTA 6 గేమ్ ఎలా ఆడాలి? ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి! గేమ్ ఆడే సీక్రెట్ ట్రిక్ ఇదే!

GTA 6 గేమ్ ఎలా ఆడాలి? ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి! గేమ్ ఆడే సీక్రెట్ ట్రిక్ ఇదే!

How to Play GTA 6: ప్రపంచవ్యాప్తంగా గేమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI (GTA 6) ఎట్టకేలకు విడుదలవుతోంది. భారత్‌లో నవంబర్ 19, 2026 అర్ధరాత్రి 12:00 గంటల (12:00 AM IST) నుంచి ఈ గేమ్ అందుబాటులోకి రానుంది. అయితే, ఈ గేమ్ ఆడటానికి మీ కన్సోల్‌లో ఎంత స్టోరేజ్ ఉండాలి? ఏ ప్లాట్‌ఫామ్‌లలో ఇది పని చేస్తుంది? అందరికంటే ముందే ఈ గేమ్ ఎలా ఆడాలి? అనే పూర్తి వివరాలని ఇప్పుడు మీరు V6 వెలుగు వెబ్ సైట్ లో చూడండి.. 

ఏ ప్లాట్‌ఫామ్‌లలో GTA 6 పని చేస్తుందంటే:

* కన్సోల్స్: ప్రస్తుతం PlayStation 5 (PS5), Xbox Series X/S కన్సోల్స్‌లో మాత్రమే నేరుగా ఆడే అవకాశం ఉంది. 

* క్లౌడ్, రిమోట్ ప్లే: పాత Xbox One యూజర్లు స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో Xbox Cloud Gaming ద్వారా ఆడొచ్చు. అలాగే PS5 లేదా Xbox ఉన్నవారు Remote Play ద్వారా మీ పీసీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్‌పైకి స్ట్రీమ్ చేసుకుని ఆడుకోవచ్చు.

* 212 GB స్టోరేజ్ తప్పనిసరి: గేమ్ ఇన్‌స్టాల్ చేయడానికి మీ కన్సోల్‌లో కనీసం 212 GB ఫ్రీ స్పేస్ ఖాళీగా ఉంచుకోవాలి. డిజిటల్‌గా కొనుగోలు చేసిన వారు రాక్‌స్టార్ గేమ్స్ లేదా కన్సోల్ స్టోర్ నుంచి ముందే ప్రీ-లోడ్ (Pre-Load) చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. 

అందరికంటే ముందే GTA 6 ఆడే సీక్రెట్ ట్రిక్: 

* ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు గేమ్ అన్‌లాక్ అవుతుంది. అంటే భారత్, యూరప్, అమెరికా కంటే ముందే న్యూజిలాండ్ (New Zealand) లో గేమ్ రిలీజ్ అవుతుంది. 

* Xbox Series X/S యూజర్లకు జాక్‌పాట్: మీ కన్సోల్‌లో Settings > System > Language and Location లోకి వెళ్లి లొకేషన్‌ను New Zealandకి మార్చి రీస్టార్ట్ చేస్తే, భారత్ కంటే కొన్ని గంటల ముందే మీరు గేమ్ ఆడొచ్చు. 

* PS5 యూజర్లకు రూల్: ప్లేస్టేషన్ అకౌంట్లు రీజియన్-లాక్ అయి ఉంటాయి కాబట్టి, ముందే ఆడాలంటే కొత్తగా న్యూజిలాండ్ PSN అకౌంట్ క్రియేట్ చేసి ఆ స్టోర్ ద్వారా గేమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

గేమ్‌ప్లేలో కొత్త రూల్స్: 

* ఈసారి రాక్‌స్టార్ గేమ్స్ గేమ్‌ప్లేను మరింత వాస్తవికంగా (Realistic) మార్చింది:

* ఇద్దరు ప్రధాన పాత్రలు (Dual Protagonists): వైస్ సిటీ / లియోనిడా నగరంలో జేసన్ డువాల్ (Jason Duval), లూసియా కామినోస్ (Lucia Caminos) పాత్రల మధ్య మారుతూ ఆడవచ్చు. పోలీసుల ఛేజింగ్‌లలో ఒకరికొకరు కవర్ ఇచ్చుకునేలా కమాండ్స్ ఇవ్వొచ్చు.

* లిమిటెడ్ వెపన్స్ (Limited Weapon Carry): పాత గేమ్స్‌లాగా వందల కొద్దీ తుపాకులను జేబులో పెట్టుకుని తిరగడం ఇప్పుడు కుదరదు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఆయుధాలను మోసుకెళ్లే వీలుండటంతో, మిషన్‌కు తగ్గట్టు ఆయుధాలను ఎంచుకోవాలి.

* బ్యాంక్ మనీ, పోలీస్ అలర్ట్: మీ దగ్గర ఉన్న నగదును ఎప్పటికప్పుడు బ్యాంకులో వేసుకోవాలి, లేదంటే పోలీసులకు దొరికినా లేదా గాయపడినా చేతిలో ఉన్న డబ్బు పోతుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బట్టలు మార్చుకోవడం, వాహనాలు మార్చడం వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.