ప్రపంచవ్యాప్తంగా GTA 6 మేనియా నడుస్తోంది. అన్ని దేశాల్లో అర్థరాత్రి 12 గంటలకు GTA గేమ్ అన్ లాక్ అవుతుందంటూ రాక్ స్టార్ గేమ్స్ సంస్థ ప్రకటించిన క్రమంలో..గేమర్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. GTA 5 విడుదలైన 13 సంవత్సరాల తర్వాత కొత్త వర్షన్ వస్తున్నందున గేమర్స్ లో దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే ఈ గేమ్ న్యూజిలాండ్ లో రిలీజ్ అవ్వగా.. మిగతా దేశాల్లో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు గేమర్స్.
ఇండియా సహా ఇతర దేశాల్లో రిలీజ్ ఎప్పుడంటే..!
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో ఈ గేమ్ అందుబాటులోకి వస్తుంది. ఇండియాలో నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటలకు గేమ్ రిలీజ్ అవుతుందని తెలిపింది కంపెనీ.
యూరప్, బ్రెజిల్, UK లాంచ్ టైమింగ్స్
సెంట్రల్ యూరప్‌లో నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటలకు (UTC నవంబర్ 18 రాత్రి 23:00) గేమ్ విడుదల అవుతుంది. యూకే, ఐర్లాండ్‌లో అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు అందుబాటులోకి వస్తుంది.
అమెరికాలో లాంచ్ టైమింగ్ పై ఇంకా క్లారిటీ లేదు..
అమెరికాలో లాంచ్ సమయంపై రాక్ స్టార్ గేమ్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కంపెనీ "midnight local time" అని మాత్రం చెప్పింది. ఇది Eastern Time ప్రకారం అయితే — ఈస్ట్ కోస్ట్‌లో నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటలకు, సెంట్రల్ రీజియన్‌లో నవంబర్ 18 రాత్రి 11 గంటలకు, మౌంటెన్ రీజియన్‌లో రాత్రి 10 గంటలకు, వెస్ట్ కోస్ట్‌లో రాత్రి 9 గంటలకు అందుబాటులోకి వస్తుంది.
అయితే ప్రతి టైమ్‌జోన్‌లో అర్ధరాత్రి 12 గంటలకు అన్‌లాక్ చేస్తే వెస్ట్ కోస్ట్ ప్లేయర్లు నవంబర్ 19 అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో Rockstar అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వలేదని కంపెనీ తెలిపింది.
