హైదరాబాద్‌ నాగోల్ లో  విషాదం.. చెట్టు కూలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ నాగోల్ లో  విషాదం.. చెట్టు కూలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా కూలడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సాయికుమార్ (29) అనే యువకుడు గ్యాస్ బుక్ చేసేందుకు గౌరెల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా అతనిపై కూలింది. దీంతో చెట్టు కింద చిక్కుకున్న సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు సాయికుమార్ ఇన్ఫోసిస్ సంస్థలో గత ఐదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.