GTA 6 న్యూజిలాండ్‌లో రిలీజ్.. ఇండియాలో ముందే ఆడాలంటే ఏం చేయాలి..?

GTA 6 న్యూజిలాండ్‌లో రిలీజ్.. ఇండియాలో ముందే ఆడాలంటే ఏం చేయాలి..?

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ గేమ్ GTA 6 న్యూజిలాండ్ లో విడుదలైంది.. ఇండియాలో మరి కొన్ని గంటల్లో లాంచ్ కానుంది. 13 ఏళ్ళ  తర్వాత ఈ గేమ్ కి సంబందించిన అప్ డేటెడ్ వర్షన్ రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా GTA 6 మేనియా నెలకొంది. న్యూజిలాండ్ కాలమాన ప్రకారం ఈ గేమ్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన క్రమంలో ఈ గేమ్ కి సంబంధించిన రివ్యూస్ పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ గేమ్ ని రిలీజ్ కి ముందే ఆడాలన్న ఆసక్తితో ఉన్నారు గేమర్స్.

ఇండియా టైమింగ్ ప్రకారం నవంబర్ 18 సాయంత్రం 4:30 గంటలకు న్యూజిలాండ్ లో ఈ గేమ్ రిలీజ్ అయ్యింది. ఇది GTA 6 గ్లోబల్ రోల్‌అవుట్‌కు ప్రారంభం అని తెలిపింది కంపెనీ. అమెరికన్ స్ట్రీమర్ N3ON ముందే న్యూజిలాండ్‌ కు వెళ్లి, గేమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే లైవ్‌స్ట్రీమ్ చేశాడు. నవంబర్ 18 తేదీన EST ప్రకారం ఉదయం 6 గంటలకు తన లైవ్‌స్ట్రీమ్ షెడ్యూల్ చేసినట్లు అతను X వేదికగా ప్రకటించాడు.

వివిధ దేశాల్లో రిలీజ్ టైమింగ్స్:

న్యూజిలాండ్: నవంబర్ 19, రాత్రి 12:00 (NZDT)
భారత్: నవంబర్ 19, రాత్రి 12:00 (IST)
US ఈస్ట్ కోస్ట్: నవంబర్ 18, తెల్లవారుజామున 6:00 (EST)
US వెస్ట్ కోస్ట్: నవంబర్ 18, తెల్లవారుజామున 3:00 (PST)
ఆస్ట్రేలియా: న్యూజిలాండ్ తర్వాత రెండు గంటలకు

భారతీయ గేమర్లు నవంబర్ 19 అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుందని ఇండియన్ ప్లేస్టేషన్ స్టోర్ లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

ముందే ఆడాలంటే వర్కెరౌండ్ ఉందా..?

కొందరు Xbox యూజర్లు కన్సోల్ రీజియన్‌ను న్యూజిలాండ్‌కు మార్చుకోవడం ద్వారా ముందుగా గేమ్ యాక్సెస్ చేయొచ్చని చెప్తున్నారు. అయితే PS5 యూజర్లకు ఈ అవకాశం లేదు. వారు న్యూజిలాండ్ PlayStation Network అకౌంట్ ద్వారా, ఆ రీజియన్ స్టోర్ ద్వారా గేమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇండియా అకౌంట్‌తో ప్రీ-లోడ్ చేసుకున్న మాత్రాన గేమ్ ముందుగా అన్‌లాక్ కాదు.

ఈ వర్కెరౌండ్లు ప్రతి యూజర్‌కు పనిచేస్తాయని చెప్పలేమని అంటున్నారు గేమింగ్ నిపుణులు. సోనీ ప్లేస్టేషన్ నెట్వర్క్ నిబంధనలు రీజియన్ మార్పులపై పరిమితులు విధిస్తాయి. వాటిని అతిక్రమిస్తే అకౌంట్ సస్పెన్షన్, బ్యాన్ రిస్క్ ఉంటుందని కంపెనీ వినియోగదారులను హెచ్చరించింది.