సూర్యకు విలన్‌గా గోపీచంద్.. తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

సూర్యకు విలన్‌గా గోపీచంద్.. తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

ఓ వైపు టాప్‌‌ స్టార్స్‌‌గా రాణిస్తున్న హీరోలు కూడా సరైన అవకాశం రావాలే కానీ విలన్‌‌గానూ మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు విలన్‌‌గా తనదైన ముద్ర వేసిన గోపీచంద్ మరోసారి ప్రతినాయకుడిగా కనిపించనున్నారనే టాక్‌‌ వినిపిస్తోంది. కోలీవుడ్ హీరో సూర్య కథానాయకుడిగా ‘డీసీ’ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఓ భారీ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో విలన్‌‌  పాత్రకు గోపీచంద్‌‌ను సంప్రదించినట్టు సమాచారం.  ఆయన ఓకే చెబితే... ఇదే గోపీచంద్‌‌కు తొలి తమిళ చిత్రం కానుంది. ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ కాంబినేషన్‌‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో ‘సర్వం మాయ’ ఫేమ్ రియా షిబు కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  సంగీత దర్శకులుగా అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక గతంలో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో రఘు, దేవుడు, భద్రన్న పాత్రలతో గోపీచంద్ విలన్‌‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారి యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం ఆయన ‘భరతవర్ష: సాగా ఆఫ్ శూల’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సూర్యతో గోపీచంద్‌‌ కాంబినేషన్ ఖరారైతే కోలీవుడ్‌‌లోనూ కొత్త అవకాశాలు లభించే వీలుంది.