ట్రిలియన్ డాలర్ల దిశగా ఎగుమతులు..తొలి 6 నెలల్లో 16.6శాతం వృద్ధి

ట్రిలియన్ డాలర్ల దిశగా ఎగుమతులు..తొలి 6 నెలల్లో 16.6శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వస్తువులు, సేవల ఎగుమతులు మొత్తం ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.95 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబరు మధ్య దేశ ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16.6 శాతం పెరిగాయని తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ ఎగుమతుల పనితీరు మెరుగ్గా ఉందని అగర్వాల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత వస్తువులు, సేవల ఎగుమతుల విలువ తొలిసారిగా 863 బిలియన్ డా లర్లకు చేరిందని ఆయన తెలిపారు.