సుధీర్రెడ్డి వర్సెస్ మధు యాష్కీ.. ఎల్బీనగర్లో ప్రొటోకాల్ లొల్లి

సుధీర్రెడ్డి వర్సెస్ మధు యాష్కీ.. ఎల్బీనగర్లో ప్రొటోకాల్ లొల్లి

దిల్ సుఖ్ నగర్,వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట మల్టీపర్పస్ మినీ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మధుయాష్కీ గౌడ్​ మధ్య ప్రొటోకాల్​లొల్లి జరిగింది.  3,558 మంది లబ్ధిదారులకు పెన్షన్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్సీ,  తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రోటోకాల్ పాటించాలని మధు యాష్కీ,ఇతర మాజీ కార్పొరేటర్లు వేదికపై మాట్లాడొద్దని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనగా నినాదాలు చేయగా, పోటా పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగడంతో సరూర్ నగర్ పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి చెదరగొట్టారు.