- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరిక
ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ లోని నైటింగేల్ హోమ్ లో కరెంట్ షాక్‌తో మూడో తరగతి స్టూడెంట్రెబెక్కా(11) చనిపోగా, బుధవారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరుపై విచారణ జరిపారు. భవనం పైకి వెళ్లి కరెంట్షాక్కొట్టిన ప్లేస్‌ను పరిశీలించారు. స్టూడెంట్స్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కమిషన్ సభ్యులు అపర్ణ, వందన గౌడ్ మాట్లాడుతూ రెబెక్కా మృతి చెందడానికి హాస్టల్ నిర్వాహకులు, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నదన్నారు. విచారణలో పక్కా నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని, రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చి పరిశీలిస్తామన్నారు. ముషీరాబాద్ ఎస్సై రాజేశ్, విద్యుత్ శాఖ ఏఈ సుధామాలతో మాట్లాడారు.
