ఏవీజీసీ-‌‌‌‌‌‌‌‌- ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ రంగానికి తెలంగాణలో అపార అవకాశాలు.. అంతర్జాతీయ క్రియేటివ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్: మంత్రి జూపల్లి

ఏవీజీసీ-‌‌‌‌‌‌‌‌- ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ రంగానికి  తెలంగాణలో అపార అవకాశాలు.. అంతర్జాతీయ క్రియేటివ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్: మంత్రి జూపల్లి
  • తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాల్లో ఏవీజీసీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, పర్యాటక రంగాలదే కీలక పాత్ర
  • వచ్చే నెల7 నుంచి 13 వరకు ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంతర్జాతీయ క్రియేటివ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్) రంగానికి రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని, యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బుధవారం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిశ్రమ ప్రముఖులతో నిర్వహించిన ఏవీజీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

2034 నాటికి లక్ష కోట్ల డాలర్లు, 2047 నాటికి 3లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్–2047’ సాధనలో ఏవీజీసీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, పర్యాటక రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. తెలుగు సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సృజనాత్మక ఆలోచనలతో యువత కొత్త ప్రాజెక్టులు చేపట్టేలా రాష్ట్రంలోనే మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ‘ఇండియా జాయ్–2026’ను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఏడు రోజులపాటు సాగే మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 80 వేల మందికి పైగా బీ2సీ సందర్శకులు, 8,500 మందికి పైగా బీ2బీ ప్రతినిధులు, 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఎడ్యుకేట్, ఎగ్జిబిట్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్, ఎంజాయ్ అనే నాలుగు ప్రధాన అంశాలతో యానిమేషన్, గేమింగ్, సినిమా, ఈ–స్పోర్ట్స్, డిజిటల్ కంటెంట్ రంగాలకు ఉమ్మడి వేదికగా నిలుస్తుందన్నారు. ఇండియా జాయ్ విజయాన్ని కేవలం సందర్శకుల సంఖ్యతోనే కాకుండా కొత్త వ్యాపార అవకాశాలు, స్థానిక స్టూడియోలకు దక్కే ప్రయోజనాలతో కొలవాలని సూచించారు.  

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి 

తెలంగాణలోని ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో–వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, హస్తకళలు, జల పర్యాటక, బౌద్ధ పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధిలో ఏవీజీసీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ సంస్థలు భాగస్వాములు కావాలని జూపల్లి కోరారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతికతలతో రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త అనుభూతులతో ప్రపంచానికి పరిచయం చేయవచ్చన్నారు. ఏఐతో వస్తున్న మార్పుల దృష్ట్యా ఈ రంగాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

స్టూడియోలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాలని, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఫిల్మ్ స్కూళ్లు తమ విద్యార్థులను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేసి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.