- రూ.10 లక్షల నగదు బహుమతులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆలివ్ మిఠాయి సంస్థ ‘ఇంటికో ఇంకుడు గుంత’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం హైడ్రా ఆఫీసులో ఆవిష్కరించారు.
ఏం చేయాలంటే..
ఇంకుడు గుంత నిర్మించి, దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని @oliveforsociety పేజీకి కొలాబరేషన్ పోస్టుగా అప్లోడ్ చేసి, ఆ పేజీని ఫాలో కావాలని సంస్థ యజమాని దొర రాజు చెప్పారు. పోటీలో పాల్గొన్నవారు పంపిన వీడియోల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి మూడు వీడియోలకు రూ.10 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సేవ్ వాటర్.. సేవ్ ఎర్త్, ట్రీ గార్డ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు.
