సిమెంట్‌ రంగంలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు

సిమెంట్‌ రంగంలో రూ.75 వేల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్‌ కంపెనీలు 2027, 2028 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి సుమారు రూ.75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, గ్రైండింగ్‌ యూనిట్ల విస్తరణ, విద్యుత్‌ ఖర్చుల తగ్గింపు, పునరుత్పాదక ఇంధన వినియోగం పెంపుపై ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నాయి. క్రిసిల్‌ రేటింగ్స్‌ నవంబర్‌ 18న విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోని 18 సిమెంట్‌ కంపెనీలను పరిశీలించగా ఈ అంచనాలు వెల్లడయ్యాయి. 

2026 మార్చి నాటికి దేశంలో సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 718 మిలియన్‌ టన్నులకు చేరింది. వచ్చే 2 ఆర్థిక సంవత్సరాల్లో మరో 110–120 మిలియన్‌ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఇందులో మూడింట రెండొంతుల సామర్థ్యం మార్కెట్లకు దగ్గరగా ఏర్పాటు చేసే గ్రైండింగ్‌ యూనిట్ల ద్వారా రానుంది. ఇంధన ఖర్చులు పెరగడంతో టన్ను సిమెంట్‌పై నిర్వహణ లాభం 2026 ఆర్థిక సంవత్సరంలోని రూ.980 నుంచి 2027లో రూ.875–900కు తగ్గవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. పెరిగిన పెట్టుబడుల కారణంగా అప్పుల భారం కూడా కొంత పెరగనుంది.