హైదరాబాద్, వెలుగు: 2026–27 అకడమిక్ ఇయర్ కు మేనేజ్‌మెంట్ కోటా మెడికల్ పీజీ డిగ్రీ, డిప్లొమా అడ్మిషన్ల ఫైనల్ మెరిట్ లిస్ట్ ను కాళోజీ హెల్త్ వర్సిటీ రిలీజ్ చేసింది. 1,612 మందితో కూడిన లిస్ట్ లో 524 స్కోరు, 6,438 ర్యాంకుతో కౌసల్య సుప్రజ ఓసూరి మొదటి స్థానంలో నిలిచారు.
519 స్కోరు (7,406 ర్యాంకు)తో సి.సాయి అంకిత రెండో స్థానంలో, 517 స్కోరు (7,735 ర్యాంకు)తో ఆదిత్యరాజ్ సింగ్ ఠాకూర్ మూడో స్థానంలో ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం పలువురు పిటిషనర్లను ఈ మెరిట్ లిస్ట్ లో చేర్చారు. 84,933 ర్యాంకు, 338 స్కోరు సాధించిన అభ్యర్థి నేనావత్ వాసవి సాయి శ్రీ వర్ధన్ ను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్టీ కేటగిరీగా పరిగణించారు.
