భారతదేశంలో అమ్ముతున్న బంగారంలో కొత్త రకం కల్తీ బయటపడింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ‘రీనియం’ రహస్య పౌడర్‌ను బంగారంలో కలిపి వినియోగదారులను మోసం చేస్తున్నారు చాలా మంది వ్యాపారులు. ఈ రీనియం మెటల్ ద్వారా చేసే గోల్డ్ కల్తీని గుర్తించడంలో అత్యాధునిక హాల్‌మార్కింగ్ యంత్రాలు కూడా ఫెయిల్ కావటం కస్టమర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన ఒక స్టింగ్ ఆపరేషన్ లో ఈ బంగారం కల్తీ గుట్టు బయటపడింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక నగల వ్యాపారి సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా బంగారంలో రాగి లేదా వెండిని కలిపితే హాల్‌మార్క్ మెషీన్లు వెంటనే వాటిని పసిగడతాయి. కానీ రీనియం పౌడర్‌ను కలిపితే అవి ప్యూర్ గోల్డ్‌గానే చూపిస్తున్నాయి. దీనినే చాలా మంది వ్యాపారులు ప్రస్తుతం బంగారం రేట్ల పతనం సమయంలో విచ్చలవిడిగా వాడేస్తున్నారంట. దీంతో రేట్లు తగ్గాయని ఆనందపడాలో లేక తాము కొంటున్న బంగారం నిజమైనదో, రీనియం కలిపిందో తెలియక చాలా మంది కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ రీనియం కల్తీ?
ఈ కల్తీ ప్రక్రియను పరిశీలించేందుకు 7.830 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారానికి.. ఒక గ్రాము రీనియం పౌడర్‌ను కలిపారు. దీనివల్ల బంగారం బరువు 8.830 గ్రాములకు పెరిగింది. ఆ తర్వాత దీనిని ఒక హాల్‌మార్క్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షించగా.. ఆ యంత్రం కల్తీ చేసిన బంగారాన్ని 24 క్యారెట్ల ప్రూర్ గోల్డ్ అని సర్టిఫై చేసింది. ఆ తర్వాత దీనికి మరో 0.75 గ్రాముల ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్ల ఆభరణంగా మార్చారు స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన మీడియా ప్రతినిధులు. దీనిని మళ్లీ పరీక్షించగా హాల్‌మార్క్ సెంటర్ దీనికి ‘92K916’ సర్టిఫికేషన్ ఇచ్చింది. అంటే అది 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల బంగారమని సర్టిఫై చేసింది. అంటే ఇక్కడ బంగారంలో కలిపిన రీనియం పౌడర్ అస్సలు గుర్తించబడలేదు.
►ALSO READ | శనివారం తగ్గిన గోల్డ్ రేట్లు.. తులం బంగారం (24 క్యారెట్లు) లక్ష రూపాయలకు వస్తుందా..?
నిజానికి ఆ ఆభరణంలో అసలైన బంగారం ఉన్నది కేవలం 7.830 గ్రాములు మాత్రమే. ఈ లెక్కన చూస్తే రియల్ గోల్డ్ వస్తువు ప్యూరిటీ 81.73 శాతం మాత్రమే. అంటే దీనిని సుమారు 20 క్యారెట్ల గోల్డ్ అని పిలవాలి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం చూస్తే.. రీనియం కలిపిన ఒక తులం బంగారం కొన్న కస్టమర్ దాదాపు రూ.14వేల 700 వరకు నష్టపోతారు.
A very big gold scam shows rhenium being smuggled from China to add 20% of this powder and mix it with 80% gold while even hallmark certification was not able to catch it and leaving buyers cheated with fake purity stamps while lazy testing rules fail everyday folks. https://t.co/h2Jmry7e3n
— VIZHPUNEET (@vizhpuneet) November 19, 2026
చైనా నుంచి రీనియం దిగుమతి
బంగారంలో 25 శాతం వరకు రీనియం కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరని చైనాలోని షెన్‌జెన్ నగరానికి చెందిన ఏజెంట్లు చెబుతున్నారు. అక్కడ రీనియం తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయని.. 100 గ్రాముల పౌడర్ రూ.3 లక్షల వరకు ఉంది. భారత్‌లోని ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో దీనికి డీలర్లు కూడా ఉన్నారు.. కొరియర్ ద్వారా ఎక్కడికి కావాలన్నా సప్లై చేసేస్తున్నారు.
►ALSO READ | ఇండియాలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూసి నోర్చుకోండి : అమెరికా బ్యాంకులపై ట్రంప్ చురకలు!
దేశంలో ప్రతిరోజూ సుమారు 2వేల నుంచి 2వేల 200 కిలోల బంగారం సేల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రీనియం కల్తీపై బంగారం వ్యాపార సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా పౌడర్ వాడకం పెరిగిందని, దీనివల్ల బంగారం కొంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు భారీగా మోసపోతున్నారని అసోసియేషన్లు అంగీకరించాయి. ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లలోని మెషీన్లు కూడా ఈ కల్తీని గుర్తించలేకపోయాయనే వాస్తవం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
