సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు కావ్య మారన్ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గిఫ్ట్ బాక్స్ పంపించారు. గిఫ్ట్ బాక్స్లో గోల్డ్ రింగ్ కూడా ఉండటంతో సదరు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు. కావ్య మారన్ మనసు ఎంత మంచిదోనని తమ యజమానిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీపావళి పండుగకు సోన్ పాపిడి బాక్స్ కాదు కదా సింగిల్ సోన్ పాపిడి కూడా ఇవ్వని కొన్ని సంస్థలు ఈరోజుల్లో మనుగడ సాగిస్తున్నాయని నెటిజన్లు వాపోయారు.
🔔 | SUN GROUP has gifted its key employees GOLD RINGS, GOLD COINS, NEW CLOTHES & SWEETS along with invitation cards for the WEDDING RECEPTION FEAST of ANIRUTH & and KAVYA. DATE : 25 NOVEMBER PLACE : SUN TV HEAD OFFICE TIME : 1PM https://t.co/ErIVNrj9Bt
— JB 🕊️ (@jeba_of) November 21, 2026
ఉద్యోగులకు జీతం ఇవ్వడమే ఎక్కువ అనే తరహాలో పనిచేయించుకుంటున్నాయని దుయ్యబట్టారు. అలాంటి ఈరోజుల్లో తన పెళ్లికి గుర్తుగా ఉద్యోగులకు గోల్డ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వడం చిన్న విషయం కాదని సోషల్ మీడియా సాక్షిగా కొందరు నెటిజన్లు కావ్య పెద్ద మనసుపై ప్రశంసల జల్లు కురిపించారు.
#KavyaMaran reportedly gifted gold rings to all Sun Group employees as part of the wedding. https://t.co/2QG3BlzTeK
— ‘’ (@chill_guys22) November 21, 2026
హైదరాబాద్ జెమినీ టీవీ ఆఫీస్లో ఒక ఉద్యోగి గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంగతి బయట ప్రపంచానికి తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంస్థలో పనిచేసే సిబ్బందితో వ్యక్తిగత ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశం ఉండటం ప్రశంసనీయం. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు యజమానిగా కావ్య మారన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
►ALSO READ | అల్లుడు గిల్కి అన్యాయం.. సచిన్ కూతురు పెళ్లి చేసుకునేది ఈ యంగ్ హీరోనే..?
ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలో ఆమె కనిపించడం, జట్టును ప్రోత్సహించడం వీడియోలు వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులకు ఆమె సుపరిచితురాలయ్యారు. సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావ్య మారన్ అని చెప్పడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
