తల్లి పాడె మోసిన..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తల్లి పాడె మోసిన..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన తల్లి సావిత్రీ దేవి (91) భౌతికకాయాన్ని స్వయంగా పాడె మోసి తుది వీడ్కోలు పలికారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సావిత్రీ దేవి నిన్న ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామంలో కన్నుమూయగా.. శనివారం (నవంబర్ 21, 2026) ఉదయం హరిద్వార్ లోని చంఢీ ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించారు. పంచూర్ గ్రామం నుంచి చండీఘాట్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి భౌతికకాయం దగ్గర యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిని మించిన నీడ, ఆశ్రయం, రక్షణ, ప్రేమ మరేదీ లేదని ఆయన X లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.