మందమర్రిలో ఏడు ఎకరాల్లో.. హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్: మంత్రి వివేక్ 

మందమర్రిలో ఏడు ఎకరాల్లో.. హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టవర్స్: మంత్రి వివేక్ 

మందమర్రిలో ఏడు ఎకరాల్లో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మిస్తామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం ( నవంబర్ 25 ) మందమర్రిలో పర్యటించిపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నూరు నియోజక వర్గంలో 350 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని... పేద బడుగు బలహీన వర్గాల చిరునవ్వు కోసమే ప్రజా ప్రభుత్వం తపన పడుతోందని అన్నారు మంత్రి వివేక్.

బీఆర్ఎస్ హయంలో కొత్త పెన్షన్లు ఇవ్వలేదని.. కాంగ్రెస్ పాలనలో 2 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఆర్థికంగా ఆగమైందని... రూ.8 లక్షల కోట్ల అప్పులకు 80 వేల కోట్ల వడ్డీ లు ప్రజాపాలన ప్రభుత్వం కట్టిందని అన్నారు మంత్రి వివేక్. మహిళల ఫ్రీ బస్సు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ను ఆర్టీసీకి చెల్లించిందని అన్నారు మంత్రి వివేక్.

మందమర్రిలో 50 కోట్లతో సీసీరోడ్లు,డ్రైనేజీ కాలువలు మౌళిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులను చేపడుతున్నానని.. మందమర్రి లో అత్యాధునికమైన పరికరాలతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలోనే చేపడతానని అన్నారు. 

ALSO READ : బాచుపల్లి కార్మికుల మృతి ఘటనపై HRC సీరియస్

ఫారెస్ట్ అనుమతులు రాగానే ఆర్కే ఫేజ్ 2 ఓపెన్ కాస్ట్ ను ప్రారంభిస్తామని అన్నారు. ఆర్కే ఓపెన్ కాస్ట్ లో 5 వేల మంది కి ఉపాధి దొరుకుతుందని అన్నారు మంత్రి వివేక్.