వాస్తు సిద్దాంతానికి జ్యోతిష్య శాస్త్రానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూజలు.. చేయడం.. జ్యోతిష్య పండితు సూచనలు పాటించడం.. వాస్తు ప్రకారం ఏవస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే పెడతారు. ఇవే కాదు.. నిత్యం చేసే పనుల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే అనుకున్న పనుల్లో వస్తున్న ఆటంకాలు తగ్గడమే కాకుండా .. ఒత్తిడి కూడా తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ఉప్పు నీటితో స్నానం చేయడం వలన వాస్తు పరంగా .. జ్యోతిష్య పరంగా అనేక లాభాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు... ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . !
ఉప్పు.. లవణం.. సాల్ట్ ఇది చాలా ముఖ్యమైనది. వంటల్లో ఇది ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కరలేదు. మరోముఖ్యవిషయం ఏంటంటే.. ఇంట్లో చంటి పిల్లలు ఏడుస్తుంటే ఉప్పు తిప్పండని పెద్దలు చెబుతుంటారు. అలా చేయడం వలన ప్రతి కూల శక్తి తొలగుతుందని నమ్ముతుంటారు.
వాస్తు సిద్దాంతం ప్రకారం .. రోజూ స్నానం చేసేటప్పుడు చిటికెడు ఉప్పును నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయడం వలన శరీరం.. మనస్సు తేలికపడుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.అందుకే చేస్తున్న పనుల్లోతరచూ ఆటంకాలు వస్తుంటే ఉప్పు నీటితో స్నానం చేయడం వలన తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం ఉప్పు వ్యతిరేక శక్తిని తొలగించే శక్తి కలిగి ఉంటుంది. . దీన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం, మనస్సు తేలికపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారుజ . ఉప్పు నీటితో స్నానం చేయడం వలన మన శరీరానికి పట్టిన చెడు శక్తి తగ్గుతుంది. జీవితంలో సానుకూలతను తెస్తుంది. అందుకే మనస్సు చిరాకుగా ఉన్న.. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అనిపించినప్పుడల్లా ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ఉప్పు నీటితో స్నానం చేయడం వలన మరో ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. బాధ.., భయం అనిపిస్తే ఉప్పు నీటితో స్నానం చేయండి. దీని వలన వాస్తు సిద్దాంతం ప్రకారం ఉపశమనం కలిగి.. . మనస్సును శాంతపరుస్తుంది. ఇంకా సానుకూల ఆలోచనలు వచ్చేలా ఉప్పునీటి స్నానం ఉపయోగపడుతుందని సిద్దాంతులు చెబుతున్నారు.
►ALSO READ | వాస్తు ప్రకారం ఫ్రిజ్ ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది..?
చాలామందికి అనుకున్న పనుల్లో తరచూ ఆటంకాలు రావడంతో చిరాకు పడతారు. ఎంత కష్ట పడినా ఉపయోగం ఉండదు. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అలాంటి వారు కచ్చితంగా ఉప్పునీటితో స్నానం చేసి.. దైవ దర్శనం చేసుకొని మళ్లీ పని ప్రారంభించండి.. ఆత్మవిశ్వాసం పెరిగి.. ఈ సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని పూర్తయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఉప్పు నీటితో స్నానం చేయడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీని వలన ఇంటి వాతవరణం మెరుగుపడుతుంది. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య అవగాహన పెరిగి ఎలాంటి గొడవలు జరగవు. ప్రతి చిన్న విషయానికి కోపంరాదు. ఇతరులతో మీ సంబంధాలు కూడా బలపడతాయి.
వాస్తు ప్రకారం ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా తాజాగా, శక్తివంతంగా ఉంటారు. ప్రతి రోజూ ఇలా స్నానం చేయలేకపోతే వారానికి రెండు సార్లు ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
