ఇటు సౌత్‌లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే, అటు బాలీవుడ్ కెరీర్‌పై కూడా ఫోకస్ పెట్టింది కృతిశెట్టి. గత కొన్నాళ్లుగా సరైన కమర్షియల్ హిట్ లేక సక్సెస్ కోసం వేచి చూస్తున్న ఆమె.. బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో ఆమె హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.
‘హమ్ తేరే ప్యార్ మే’ పేరుతో రూపొందబోయే ఈ చిత్రానికి విధి ఘోడ్గావంకర్ డైరెక్టర్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దగ్గర దాదాపు 17 ఏళ్లకు పైగా వర్క్ చేసిన ఆమె ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతోంది. అభిషేక్ ఎస్. వ్యాస్‌కు చెందిన ఏవీఎస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో కృతి శెట్టి సహా మూవీ టీమ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించి ఈ చిత్ర వివరాలను ప్రకటించారు. అయితే ఇందులో నటించబోయే హీరో ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు. ‘ఉప్పెన’కు ముందు హృతిక్ రోషన్ సినిమా ‘సూపర్ 30’లో చిన్న రోల్ చేసిన కృతి శెట్టి.. ఇప్పుడు హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
DEBUT TITLED ‘HUM TERE PYAAR MEIN’ — ROHIT SHETTY TO PRESENT! Krithi Shetty is set to headline the romantic film Hum Tere Pyaar Mein, which has now gone on floors. The project is being presented by Rohit Shetty and marks the directorial debut of his longtime collaborator Vidhi Ghodgaonkar. While Krithi previously appeared briefly in Super 30, Hum Tere Pyaar Mein will mark her first Bollywood film as a leading actress. #HumTerePyaarMein #KrithiShetty #RohitShetty
— Indiawood Updates (@IndiawoodUpdate) October 14, 2026
కొత్త ప్రయత్నం.. కొత్త ఆశలు!
ఒకవైపు కొత్త దర్శకురాలు, మరోవైపు బాలీవుడ్లో హీరోయిన్గా తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కృతి శెట్టికి ప్రత్యేకంగా నిలవనుంది. సరైన కథ, ఆకట్టుకునే సంగీతం, మంచి నటన తోడైతే ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి మలుపుగా మారే అవకాశం ఉంది. మరి లేడీ డైరెక్టర్‌తో కృతి శెట్టి చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బాలీవుడ్లో ఆమెకు విజయాన్ని అందిస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జంటగా ఆమె నటిస్తోంది.
