Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీకి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడిన కారు.. వీడియో వైరల్

Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీకి తృటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడిన కారు.. వీడియో వైరల్

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తృటిలో ఓ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన నటిస్తోన్న కొత్త చిత్రం 'గన్​మాస్టర్ జీ9' మూవీ సెట్స్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా క్రేన్​కు వేలాడదీసిన ఎస్​యూవీ.. గాల్లో పల్టీలు కొడుతూ సాంకేతిక లోపంతో కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్​పై ఒక్కసారిగా పడిపోయింది.

ఇమ్రాన్‌‌‌‌ హష్మీకి అతి దగ్గరలో కారు కూలిపోవడంతో సెట్‌‌‌‌లో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ హష్మీకి ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని టీమ్ తెలియజేశారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా నటిస్తోంది.  ఈ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ నవంబర్ 27న విడుదల కానుంది.