దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పురాణాల ప్రకారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని తొమ్మది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. దుర్గ్మమ్మ అమ్మవారు తన ఎనిమిది చేతుల్లో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటారు.. ప్రతి ఆయుధం వెనుక పరమార్థం ఉంది. అమ్మవారు ధరించిన ఆయుధాలు.. వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. . . !
హిందువులు జరుపుకొనే పండుగల్లో అతి పెద్ద పండుగ దసరా ఫెస్టివల్. దేశ వ్యాప్తంగా ఐదు రోజుల నుంచి ( 2026 అక్టోబర్ 15 నాటికి) నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చెడుపై మంచి విజయం సాధించిన రోజుకు గుర్తుగా ఆశ్వయుజమాసం శుక్లపక్షం దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాము.
దసరా పండుగ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని పూజిస్తాము. శక్తి దేవతగా భావించే ఆ దేవత రాక్షసులను సంహరిస్తూ.. మంచివారిని కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. సింహంపై స్వారీ చేస్తూ అష్ట భుజాల్లో ( ఎనిమిది చేతుల్లో) ఒక్కొక్క ఆయుధం ధరించి సర్వ ప్రాణులను కాపాడుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారి ఈ 8 చేతుల్లోని ఆయుధాలు మానవాళికి జీవితంలో అనేక విషయాలు తెలియజేస్తాయి.
శంఖం : అమ్మవారి ఎడమ వైపున ఉన్న చేతుల్లో పైన ఉండే చేతిలో శంఖం ధరించి ఉంటారు. ఇది ఆనందానికి చిహ్నంగా ఉంటుంది. దీని నుంచి వచ్చే ధ్వని సర్వ ప్రాణుల్లోని చెడు అంశాలను పొగొడుతుంది. శంఖం సౌండ్కు దుష్ట ఆలోచనలు ప్రేరేపితం కాకుండా .. సృష్టిలోని అన్ని అంశాలు భయపడుతాయి.దుర్గామాత వరుణదేవుని నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది.
విల్లు,-బాణం: దుర్గాదేవికి ఉండే ఎనిమితి చేతుల్లో ఎడమవైపున పైనుంచి రెండో చేతిలో విల్లు, బాణం ఉంటాయి.ఇవి శక్తికి చిహ్నం. అమ్మవారు రాక్షసులతో పోరాడే సమయంలో వీటిని ఉపయోగించారు. దుర్మార్గులను సంహరించేందుకు దుర్గాదేవి ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందిందని చెబుతారు పండితులు.
తామర పువ్వు: దుర్గాదేవి తన ఎడమ వైపు మూడవ చేతిలో తామరపువ్వును పట్టుకుంది. ఇది పరిత్యాగానికి సంకేతం. మనుషులు బాహ్య ప్రపంచంతో అనుబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి. అంటే బురదలో వికసించిన తామరపువ్వు లాగా, మానవులు లోకంలో జీవించాలని .. మాలిన్యం, దురాశకు దూరంగా ఉండాలని మానవాళిఉండాలని చెబుతోంది.
త్రిశూలం: అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఆయుధం త్రిశూలం. ఇది దుర్గాదేవి తన ఎడమ వైపు నాల్గవ చేతిలోఉంటుంది. దీనితోనే దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది. ఈ ఆయుధాన్ని శివుడు తన త్రిశూలాన్ని దుర్గామాతకు ఇచ్చాడు. ధైర్యానికి చిహ్నంగాఉండి... త్రిశూలంలోని మూడు భాగాలు మానవులకు సత్వ, తమో, రజో అనే మూడు గుణాల గురించి బోధిస్తాయి.
సుదర్శన చక్రం : శ్రీకృష్ణుడికి ఇష్టమైన సుదర్శన చక్రాన్ని దుర్గామాతకు బహుకరించాడు. ఇది దుర్గామాత కుడిచేతి చూపుడు వేలుతో ధరించి ఉంటారు. ప్రపంచం మొత్తం అమ్మవారి ఆధీనంలో ఉందని.. సృష్టిని ఆ తల్లే నియంత్రిస్తుందని సుదర్శన చక్రం సూచిస్తుంది. ఈ చక్రం.. ధర్మానికి చిహ్నం, ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది.
ఖడ్గం: దుర్గాదేవి తన కుడివైపు రెండవ చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉంటుంది. ఇది చెడు, అజ్ఞానం నిర్మూలనకు చిహ్నం. గణేశుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చాడని చెబుతారు.
గద: దుర్గా దేవి తన కుడి వైపు మూడవ చేతిలో గదను ధరించి ఉంటుంది. దుర్గాదేవికి ఈ గదాయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లు చెబుతారు. దీనినే కలానందం అంటారు. దీనిని బలం, విధేయత, ప్రేమ, భక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.
ఓంకారం: దుర్గాదేవి ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది. భక్తులను అనుగ్రహించే అమ్మవారి చేతిలో ‘ఓం’ చిహ్నాన్ని మనం చూడవచ్చు. ఓం అంటే భగవంతుని గురించిన జ్ఞానం మనలో విత్తుతుంది, అన్ని శక్తులు అందులో ఉన్నాయి.
సింహం: ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు సింహంపై స్వారీ చేస్తుంది. క్రూరత్వం, హింసాత్మక ధోరణులకు చిహ్నంగా సింహాన్ని పరిగణిస్తారు. అలాంటి సింహంపై స్వారీ చేయడం ద్వారా దూకుడు లేదా హింసాత్మక ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అమ్మవారు తెలియజేస్తోంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
