ముంబై: యూఏఈ వేదికగా జరగనున్న అండర్-19 మహిళల ఆసియా కప్ 2026 కోసం టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాటర్ భావిక అహిరేను సెలక్టర్లు ఎంపిక చేశారు. అలానే వైస్ కెప్టెన్‌గా అనాది టాగ్డే వ్యవహరించనుంది. కర్నాటక ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ ఉమా కాశ్వి టీంలో చోటు దక్కించుకుంది.
కాగా ఈ టోర్నీ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. 2024 తర్వాత జరుగుతున్న అండర్-19 మహిళల ఆసియా కప్ ఇది కేవలం రెండో ఎడిషన్. ఈ టోర్నీ గత ఎడిషన్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
