అంతర్జాతీయ క్రికెట్‌కు రిషభ్ పంత్ రిటైర్మెంట్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

అంతర్జాతీయ క్రికెట్‌కు రిషభ్ పంత్ రిటైర్మెంట్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

Rishabh Pant Retirement: టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగా ఉన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2017లో మొదలైన తన అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొనడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అయితే, ఇది నిజంగా పంత్ పెట్టిన పోస్టా లేక ఎవరైనా ఎడిట్ చేసిన ఫేక్ స్క్రీన్‌షాటా అనే చర్చ కూడా జోరుగా కొనసాగుతోంది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో ఏముందంటే?: 

* రిషభ్ పంత్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@rishabhpant) పేరుతో ఉన్న ఆ స్క్రీన్‌షాట్‌లో ఎప్పటికీ రుణపడి ఉంటాను (Forever grateful) అనే క్యాప్షన్‌తో పాటు ఒక నోట్ కనిపిస్తోంది. 

* ఇన్నాళ్లుగా మీరు చూపించిన ప్రేమ, సపోర్టుకు చాలా ధన్యవాదాలు.. 2017 నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది.
* ఆటను ఆస్వాదిస్తూ జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఎప్పుడూ నమ్మాను, ప్రతిరోజూ అదే ప్రయత్నించాను.
* ఎంతో ఆలోచించి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. 
* భారత జెర్సీని ధరించే గౌరవం నా జీవితంలో ఎప్పటికీ అత్యంత గర్వకారణమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. లీగ్ క్రికెట్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తూ, నాకు ఎంతో ఇష్టమైన ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తానని ధన్యవాదాలు, ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి అంటూ రిషభ్ పంత్ పేర్కొన్నాడు.  

నిజమా.. ఫేక్ ప్రచారమా?: 

ఈ స్క్రీన్‌షాట్‌లో విరాట్ కోహ్లీ (_virat.kohli) లైక్ చేసినట్లు, పోస్ట్ పెట్టిన 7 నిమిషాల్లోనే 1.84 లక్షల లైక్స్ వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, పంత్ వయసు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇంత సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి ఫేక్ స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతుంటాయని, పంత్ అధికారిక ఖాతా లేదా బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఇలాంటి వాటిని నమ్మవద్దని క్రీడా వర్గాలు సూచిస్తున్నాయి.