ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లోని ఢాకా టెస్టు ఆయనకు చివరిదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. 2005లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ముష్పికర్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మూడు ఫార్మాట్లలో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. 2011-, 2017 మధ్య జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
బంగ్లాదేశ్ తరఫున 100కుపైగా టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ ఇతడే. ముష్ఫికర్ ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 108 టెస్టులు ఆడి 7,062 రన్స్ చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది. ఇక 2006 ఆగస్టులో వన్డేల్లో అరంగేట్రం చేసిన రహీం 274 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 7795 పరుగులు సాధించాడు. 102 టీ20ల్లో 1,500 రన్స్ చేశాడు.
