రేపు (నవంబర్ 29) ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ..275 పోస్టులకు 1,60,712 దరఖాస్తులు

రేపు (నవంబర్ 29) ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ..275 పోస్టులకు 1,60,712 దరఖాస్తులు
  • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష
  • గంట ముందే సెంటర్లలోకి అనుమతి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: రాష్ట్రంలో 275 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ (సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తత్సమాన స్థాయి పోస్టుల భర్తీకి ఆదివారం ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 335 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.

ఈ పరీక్షకు మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు www.tgprb.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్లు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక సమస్యలతో హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్లు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ కాకపోతే [email protected]కు మెయిల్ చేయాలని లేదా 040-41895151 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేయాలని సూచించారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. 

పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి పంపించరు. హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏ4 సైజు పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు సమయంలో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు సైజు ఫొటోను హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్ మొదటి పేజీలో కేటాయించిన చోట గమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అతికించాలి.

ఫొటో లేని హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరీక్షకు అనుమతించరు. పరీక్ష సమయంలో అభ్యర్థుల డిజిటల్ ఫొటో, వేలిముద్రలు, సంతకాలు సేకరించడంతోపాటు ఆధార్ ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ నిర్వహిస్తారు. బయోమెట్రిక్ వివరాల నమోదుకు ఇబ్బంది కలగకుండా చేతులకు మెహందీ, తాత్కాలిక టాటూలు లేదా ఇతర అడ్డంకులు కలిగించే పదార్థాలు 
పెట్టుకోవద్దని సూచించారు.