రాబోయే ఏడాదిలో ప్రపంచం మరో భారీ డిజాస్టర్ ...కరోనా మించిన మహమ్మారి.. అదే ఏఐ (AI) సంక్షోభం.. ఆన్ లైన్ వ్యవస్థలు నిలిచిపోతాయి.. ఫుడ్ సరఫరా చెయిన్ తెగిపోతుంది.. నీళ్లు కూడా దొరకవు.. కొన్ని వారాల పాటు ఏకంగా జనజీవనం స్తంభించిపోయే విపత్తు.. ఇది AI వాడకం, భవిష్యత్తు ప్రమాదాలపై రీసెర్చ్ చేస్తున్న నిపుణుల ఆందోళన. 2027లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలు నిలిచిపోవడం నుంచి నిత్యావసర సేవలకు అంతరాయం కలగడం వరకు అనేక విపత్కర పరిణామాలు ఎదురుకావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా కనీసం రెండు వారాలకు సరిపడా ఆహారం, నీరు నిల్వ చేసుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం కొంత నగదును కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఏంటీ AI విపత్తు..? ఎలా మానవ జీవితాలను ప్రభావితం చేయబోతోంది? ఫుల్ డిటెయిల్స్....
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రపంచాన్ని వేగంగా మారుస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారం ఇలా ప్రతి రంగంలోనూ AI చొరబడింది. AI అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కదా అభివృద్ది బాటలు వేస్తుందనడంలో నిజమెంతుందో ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని అంతే స్థాయిలో ఏఐ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ అభివృద్ధిపై సరైన నియంత్రణలు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఏఐతో పొంచి ఉన్న ప్రమాదం?..
భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలు మనుషుల పర్యవేక్షణ లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవచ్చు. సైబర్ దాడులు, బ్యాంకింగ్ వ్యవస్థలపై దాడులు, విద్యుత్, రవాణా వంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు AIని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రమాదకరమైన బయోవెపన్స్ తయారీకి నేరగాళ్లు ఏఐని వినియోగించవచ్చని ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ఏఐ వల్ల ఇప్పటికే అనేక రంగాల్లో ఉద్యోగాల స్వరూపం మారింది. లక్షలాది ఉద్యోగాలు పోయాయి. ఇంకా పోతున్నాయి. భవిష్యత్తులో సర్వీస్ ఓరియెంటెడ్ ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, కంటెంట్ తయారీ వంటి రంగాలపై తీవ్రప్రభావం ఉండనుంది. అదే సమయంలో AI స్కిల్స్ ఉన్నవారికి కొత్త అవకాశాలూ లేకపోలేదు. అయితే కొత్త అవకాశాలకంటే ఉపాధి కల్పన శూన్యతే అధికం అంటున్నారు నిపుణులు.
ఏఐపై నియంత్రణ ఎందుకు ..?
AI అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు అవసరం. ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. AI వ్యవస్థల సామర్థ్యాలను పరీక్షించడం, దుర్వివినియోగాన్ని అడ్డుకోవడం, మనుషుల పర్యవేక్షణ తప్పనిసరి చేయడం వంటి చర్యల అవసరం ఎంతైనా ఉందని AI భద్రతపై రీసెర్చ్ చేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు.
ప్రజలు ఏం చేయాలి..?
2027 లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కంటే డేంజర్ అయిన AI విపత్తును ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే డిజాస్టర్ ను ఎదుర్కొనేందుకు వ్యక్తిగతంగా సిద్ధపడాలని చెబుతున్నారు. మరో కొన్ని నెలల్లో ఏదో సమయంలో రెండు వారాలపాటు ఆన్ లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడం, ఆహార రవాణ వ్యవస్థ ఆగిపోవడం, ఇతర ప్రజా జీవనం స్తంభించడం వంటి జరుగే అవకాశం ఉంది.. మీకు,మీ కుటుంబానికి సరిపడా ఆహారం, నీటిని నిల్వ, అలాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలకు అంతరాయం కలిగితే ఉపయోగపడేలా నగదును సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.
ఈ లోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై కొన్ని సూచనలు చేశారు. AI పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.. దీంతోపాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ఏఐ టూల్స్‌లో షేర్ చేయకూడదు. ఏఐ ద్వారా వచ్చే వార్తలు, వీడియోలను నిజమని నమ్మకుండా అది AI కంటెంటా లేక ఒరిజనలా నిర్ధారించుకోవాలి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
AI మానవాళికి ఒక గొప్ప అవకాశమే అయినప్పటికీ బాధ్యతగా ఉపయోగించకపోతే అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కంటే, మానవ నియంత్రణలో, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్లడం అత్యంత ముఖ్యమంటున్నారు AI భద్రతపై పరిశోధన చేస్తున్న పరిశోధకులు.
https://t.co/ZZutDzEkXQ
— Nikola Jurkovic (@nikolaj2030) November 26, 2026
