ఎక్కువ వాలిడిటీతో ఫ్రీ కాలింగ్, డైలీ 3GB డేటా కావాలా ? ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా..

ఎక్కువ వాలిడిటీతో ఫ్రీ కాలింగ్, డైలీ 3GB డేటా కావాలా ? ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా..

తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా ? అయితే BSNL కస్టమర్లకు కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా రెండు నెలలకు పైగా వ్యాలిడిటీతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు ఇంటర్నెట్ డైలీ డేటా ఎక్కువ కావాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి. రూ.439 నుంచి రూ.599 వరకు ధరల్లో ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్ల కోసం వివిధ రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలు పొందాలనుకునే వారికి BSNL ప్లాన్లు ఒక ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. ముఖ్యంగా 70 నుంచి 80 రోజుల వరకు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ల కోసం చూస్తున్నవారికి ప్రస్తుతం ఈ మూడు రీఛార్జ్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో  కొన్ని ప్లాన్లు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అధిక డేటా ప్రయోజనాలను కూడా ఇస్తున్నాయి.

 రూ.439 రీఛార్జ్ ప్లాన్
ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలి.. కానీ డేటా అవసరం పెద్దగా లేదనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు చూస్తే 80 రోజుల వ్యాలిడిటీ,  అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ముంబై, ఢిల్లీ MTNL నెట్‌వర్క్‌లలోనూ నేషనల్ రోమింగ్ సదుపాయం సహా మొత్తం 300 SMSలు లభిస్తాయి.  ఈ ప్లాన్‌లో డైలీ డేటా ఉండదు. కేవలం కాలింగ్ కోసం ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికీ మంచి ప్లాన్ అని చెప్పొచ్చు. అయితే ఈ ప్లాన్ తో రోజు ఖర్చు సుమారు రూ.5.49 మాత్రమే.

 రూ.485 రీఛార్జ్ ప్లాన్
కాలింగ్‌తో పాటు రోజు డేటా కూడా కావాలనుకునే వారి కోసం BSNL ఈ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో  ప్రయోజనాలు చూస్తే  72 రోజుల వ్యాలిడిటీ,  రోజుకు 2GB హైస్పీడ్ డేటా, డైలీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్  40 Kbpsకు తగ్గుతుంది.  అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ముంబై, ఢిల్లీలోనూ నేషనల్ రోమింగ్ సదుపాయం,  రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. రోజు ఇంటర్నెట్ వాడకంతో పాటు కాలింగ్ కూడా ఎక్కువగా చేసే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ తో మీ రోజు ఖర్చు సుమారు రూ.6.74.

రూ.599 రీఛార్జ్ ప్లాన్
రోజు ఎక్కువ డేటా ఉపయోగించే వారి కోసం BSNL అందిస్తున్న మరో ప్లాన్ ఏంటంటే... ముఖ్యంగా వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడకం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎక్కువగా చేసేవారికి ఈ రూ.599 రీఛార్జ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌ ప్రయోజనాలు 70 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3GB హైస్పీడ్ డేటా, డైలీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత స్పీడ్ 40 Kbpsకు   తగ్గుతుంది. అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ముంబై ఇంకా ఢిల్లీతో సహా నేషనల్ రోమింగ్ సదుపాయం, రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి.  రోజు 3GB డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

మీ అవసరాన్ని బట్టి ప్లాన్ 
BSNL అందిస్తున్న ఈ మూడు ప్లాన్లలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇంటర్నెట్ పెద్దగా ఉపయోగించకుండా కేవలం కాల్స్ చేసుకునేవారికి రూ.439 ప్లాన్ ఉపయోగపడుతుంది. కాలింగ్‌తో పాటు రోజుకు 2GB డేటా కావాలనుకునేవారు రూ.485 ప్లాన్‌.. ఇక రోజుకు 3GB డేటా అవసరమయ్యే వారికి రూ.599 ప్లాన్ మరో బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అయితే రీఛార్జ్ చేసుకునే ముందు మీ సర్కిల్‌లో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయో లేదో BSNL అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ప్లాన్ల ధరలు, ప్రయోజనాలు మారే అవకాశం ఉంది.