మరో నెలలో ( వార్త రాసే సమయానికి ) 2026 వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. వచ్చే ఏడాది (2027) సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడుతాయని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో రెండు సూర్యగ్రహణాలు.. మూడు చంద్రగ్రహణాలు ఏర్పడుతాయి. ఎప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
వచ్చే ఏడాది (2027)లో ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు.. మూడు చంద్రగ్రహణాలు కాగా తొలి గ్రహణం రెండో నెలలోనే అంటే ఫిబ్రవరిలో ఏర్పడనుంది. ఆ తరువాత జులై.. ఆగస్టు నెలల్లో కూడా గ్రహణాలు ఏర్పడుతాయి.
2027 గ్రహణాల వివరాలు
ఫిబ్రవరి 6 తొలి గ్రహణం(కంకణాకార సూర్యగ్రహణం) : 2027లో తొలి గ్రహణం ఫిబ్రవరి 6 న ఏర్పడుతుంది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సూర్య గ్రహణంలా సూర్యుడు పూర్తిగా ఎర్రగానో, చీకటిగానో మారడు. కాంతిలో స్వల్ప మార్పు మాత్రమే కనిపిస్తుంది. ఇది భారత్‌లో కనిపించదు. కాబట్టి మన దేశంలోని వారు దీన్ని చూడలేరు. ఆధ్యాత్మిక నియమాల ప్రకారం భారత్‌లో గ్రహణం కనిపించకపోతే ఇక్కడ సూతక కాలం వర్తించదు.
ఫిబ్రవరి21 ఉపఛాయ చంద్ర గ్రహణం: చంద్రుని నీడ పలుచగా .. భూమి ద్వారా ప్రయాణిస్తుంది.. ఉపఛాయ గ్రహణంలో చంద్రుడి కాంతిలో స్వల్ప మార్పు మాత్రమే ఉంటుంది పరికరాలు లేకుండా సాధారణ కంటికి ఇది స్పష్టంగా తెలియదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జూలై 18 ఉపఛాయ చంద్రగ్రణహం: జూలైలోనూ చంద్రగ్రహణం వస్తోంది. ఆ సమయంలో భూమి లేత నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో చంద్రుడి వెలుగులో మార్పు సులభంగా కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పగలే కొద్దిసేపు చీకటి కమ్ముకుంటుంది. భారత్‌లో మాత్రం ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. వచ్చేఏడాది( 2027) విశేషమైన ఖగోళ ఘట్టాల్లో ఇదొకటి. సంపూర్ణ సూర్యగ్రహణ వేళ చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. కొంతసేపు సూర్యకాంతి ఆగిపోయి పగటిపూట చీకటి వాతావరణం ఏర్పడుతుంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇది పూర్తిగా కనిపిస్తుంది
ఆగస్టు 17ఉపఛాయ చంద్రగ్రహణం): వచ్చే ఏడాది ( 2027) చివరి గ్రహణం.ఈ చంద్ర గ్రహణం భారత్‌లో కనిపించదు. ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.
హిందూ సంప్రదాయంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ముందు సూతక కాలాన్ని పాటిస్తారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం మొదలవుతుందని భావిస్తారు. అయితే ఈ నియమాలు గ్రహణం కనిపించే ప్రాంతం, స్థానిక పంచాంగాలపై ఆధారపడి ఉంటాయి.
