కేరళకు చెందిన స్టూడెంట్స్.. ఇద్దరూ క్లాస్ మేట్స్.. నాలుగేళ్ల ప్రేమ.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగా బెంగళూరుకు వెళ్లారు. కట్ చేస్తే లాడ్జీలో ప్రియురాలు చనిపోయి ఉంది. ఈ న్యూస్ సంచలనంగా మారింది. అది కూడా ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి చంపడం ఆందోళనకలిగించే అంశం.
వివరాల్లోకి వెళ్తే.. కాటన్పేటలో ఒక లాడ్జిలో 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కేరళకు చెందిన నిందితుడు గోకుల్ కృష్ణను (23) పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతురాలు కేరళలోని పతనంతిట్ట జిల్లా ఆడూర్ నివాసి గంగ (22)గా గుర్తించారు. ఓటీసీ రోడ్డులోని రీజెన్సీ ఇన్ లాడ్జిలో శుక్రవారం [2026 నవంబర్ 27) ఉదయం 10 గంటల నుంచి 10:30 గంటల మధ్య ఈ దాడి జరిగింది. నిందితుడు గోకుల్ కృష్ణ కొల్లం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
నర్సింగ్ చదువుతూ పరిచయం
గంగ, గోకుల్ కృష్ణ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. వీరిద్దరూ నెలమంగళలోని ఒక ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశారు. గంగ గోకుల్ కంటే ఒక ఏడాది జూనియర్. ప్రస్తుతం గంగ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, గోకుల్ ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ల కన్సల్టెంట్గా పని చేస్తున్నాడు.
అనుమానంతోనే దాడి
వీరిద్దరూ గురువారం ఉదయం బెంగళూరుకు వచ్చి లాడ్జిలో దిగారు. గంగకు మరొకరితో సాన్నిహిత్యం ఉందని గోకుల్ తరచూ గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం సిటీలోని ఒక షాపులో కత్తి కొని తెచ్చినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. శుక్రవారం ఉదయం మరోసారి గొడవ జరగడంతో గంగ పొట్ట కింది భాగంలో ఎడమ వైపు గోకుల్ కత్తితో పొడిచాడు.
దాడి తర్వాత గోకుల్ లాడ్జి స్టాఫ్కు సమాచారం ఇచ్చాడు. వారు కాటన్పేట పోలీసులకు ఫోన్ చేసి గంగను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.
