కాయో, వెలుగు: పెరూలో పట్టపగలే భారీ దొపిడీకి పాల్పడ్డారు దుండగులు. భారత పౌరుడిని రౌండప్ చేసి 20 రౌండ్ల కాల్పులు జరనిపి భారీ ఎత్తున బంగారు నగలు ఉన్న బ్రీఫ్ కేసులను ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో 29 ఏళ్ల యువకుడు సహా మరో మహిళ గాయపడ్డారు. 2026 నవంబర్ 27న జరిగిన ఈ దాడిలో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి వాహనంలోని నగలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
లిమా సమీపంలోని కోస్టా వెర్డె హైవేపై ఈ ఘటన జరిగింది. ఇండియాకు చెందిన విజయ్ పగ్రానీ ఇజా (29), పెరూ మహిళ మారి నటాలీ మిరాండా ఎస్పినోజా జీపులో నగలతో శాంటా రోసా అవెన్యూ గుండా జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా దుండగులు అడ్డుకున్నారు.
హూడీలు ధరించిన దుండగులు తమ వాహనాలతో బాధితుల జీపును చుట్టుముట్టారు. నిందితులు 20 రౌండ్ల కంటే ఎక్కువ కాల్పులు జరిపినట్లు పోలీసుల నివేదికలు తెలిపాయి. వాహనం కిటికీలు ధ్వంసమవగా ఇద్దరు ప్రయాణికులు బుల్లెట్ గాయాలకు గురయ్యారు.
కాల్పుల అనంతరం నిందితులు నగలు ఉన్న బ్రీఫ్ కేసులతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితులను చికిత్స కోసం శాన్ జుడాస్ టాడియో క్లినిక్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
దుండగులు బంగారం, విలువైన నగలను లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితులు బంగారం వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. నిందితులు వాడిన వాహనాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో ఒక వాహనానికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
LOOKS STRAIGHT OUT OF GTA! INDIAN NATIONAL AMONG TWO SHOT IN DAYLIGHT JEWELLERY HEIST IN PERU A gang of hooded, heavily armed robbers opened fire on a vehicle carrying jewellery in broad daylight in Callao, near Lima, Peru. Two victims, including Indian national Vijay Pagrani Iza (29), suffered gunshot wounds but are reportedly stable. The attackers fled with briefcases. Police are investigating a possible gold theft motive.
— Subodh Kumar (@kumarsubodh_) November 28, 2026
