గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. 2026 నవంబర్ 28న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలో జరిగింది ఈ ప్రమాదం .
గ్రీన్ ఫీల్డ్స్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మోజో బస్ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి మరీ తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని108 ద్వారా కల్లూరు ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
పొద్దుపొద్దున జరిగిన ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాధితుల ఆక్రందనలతో పరిస్థితి విషాదంగా మారింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
