తెలంగాణ సాహిత్య ప్రముఖులు.. వారి జీవిత విశేషాలు

తెలంగాణ సాహిత్య ప్రముఖులు.. వారి జీవిత విశేషాలు

వట్టికోట ఆళ్వారుస్వామి

నల్గొండ జిల్లాలోని చెరువు మాదారం గ్రామంలో వట్టికోట ఆళ్వారుస్వామి జన్మించాడు. ఈయన్ని తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ గోర్కిగా పిలుస్తారు. ఆళ్వారుస్వామి చిన్నతనంలోనే తండ్రి మృతిచెందడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడి దగ్గర ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని (1942–43) జైలుకెళ్లాడు. అనంతరం కమ్యూనిస్టుల ప్రభావంతో కమ్యూనిస్టుగా మారాడు. వట్టికోట గ్రంథాలయోద్యమంతో  ప్రేరణ పొంది నిజాం వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో ఇతనిని ఇందూరు జైలుకు పంపించగా 1946–51 మధ్య కాలంలో జైలుశిక్ష అనుభవించాడు. 

రచనలు

జైలు లోపల: వట్టికోట జైలులో ఉన్నప్పుడు జైలుశిక్ష అనుభవించే ఖైదీల ఇతివృత్తాలను తీసుకుని జైలు లోపల అనే కథల సంపుటిలను రాశాడు. 
ప్రజల మనిషి: 1934–38 మధ్యకాలం నాటి తెలంగాణ ప్రజల జీవన సంఘర్షణ. 
గంగు: 1940–45 మధ్యకాలంలో తెలంగాణ రాజుల చరిత్ర.
తెలంగాణ, చిన్నప్పుడే, రామప్పరభస (సామాజిక దురాచారాలను వ్యతిరేకిస్తూ) 
ఈయన దేశోద్దారక గ్రంథమాలను స్థాపించాడు. ఈ గ్రంథమాలలో ప్రచురించిన మొదటి పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి ప్రజాధికారములు. 

దేవులపల్లి రామానుజరావు

వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలో  దేవులపల్లి రామానుజరావు జన్మించాడు. ఈయన పత్రిక శోభ (సాహిత్య మాసపత్రిక). 1953లో ఆలంపూర్​లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్​కు దేవులపల్లి రామానుజరావు అధ్యక్షత వహించాడు.

రచనలు

తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర
తెలంగాణలో జాతీయోద్యమాలు
సారస్వత నవనీతం
తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనము 
హైదరాబాద్​లో స్వతంత్రోద్యమము
యాభై సంవత్సరాల జ్ఞాపకాలు (1929–79)
తెనుగు సాహితి, వేగు చుక్కలు, ఉపన్యాస తోరణం, కావ్యమాల, తలపుల దుమారము, పంచవర్ష ప్రణాళికలు, నా రేడియో ప్రసంగాలు, మా ఊరు – ఓరుగల్లు, మన దేశం – తెలుగు సీమ.  

సింగిరెడ్డి నారాయణరెడ్డి

1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించాడు.1988లో ఈయన విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్​పీఠ్ పురస్కారం లభించింది. ఈ పురస్కారం పొందిన తొలి తెలంగాణ వ్యక్తి సి.నారాయణరెడ్డి. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ పొందాడు. అనంతరం అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా పనిచేశాడు. 

రచనలు

సినారె తొలి రచన – నవ్వని పువ్వు (1953).
అజంతా సుందరి, విశ్వంభర, కర్పూర వసంతరాయలు, ముఖాముఖి, మంటలు – మానవుడు, కలంసాక్షిగా, మనిషి – చిలక, రుతుచక్రం, మట్టిమనిషి ఆకాశం, వ్యక్తిత్వం, భూగోళమంత మనిషి, నాగార్జునసాగర్, దివ్వెల మువ్వలు, మార్పు నా తీర్పు, భూమిక, రామప్ప.
– వెలుగు, ఎడ్యుకేషన్