గ్రానైట్ పరిశ్రమకు సర్కారు అండ..సమస్యల పరిష్కారానికి కృషి:మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గ్రానైట్ పరిశ్రమకు సర్కారు అండ..సమస్యల పరిష్కారానికి కృషి:మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: గ్రానైట్ పరిశ్రమను బతికించేందుకు తనవంతు కృషి చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రానైట్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

శుక్రవారం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో నిర్వహించిన ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రానైట్ పరిశ్రమలో ఆధునిక మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.
 పరిశ్రమ రంగానికి ఎదురవుతున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, విత్తన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కమర్తపు గోపాలరావు, ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల మాధవరావు, కోశాధికారి షేక్ రియాజ్, ఉపాధ్యక్షులు దొడ్డ రాకేష్, ఆవుల వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షుడు యలమద్ది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.