స్నేహితుల నిజ జీవిత కథే సినిమాగా.. ఆకట్టుకుంటున్న కూల్ రాఖీ కూల్ పోస్టర్స్

స్నేహితుల నిజ జీవిత కథే సినిమాగా.. ఆకట్టుకుంటున్న కూల్ రాఖీ కూల్ పోస్టర్స్

మహ్మద్ సాయిద్ సమి లీడ్‌‌గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కూల్ రాఖీ కూల్’. చాయా దేవి, దానా ప్రకాష్, గిరిబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఖుస్నుమ, మళ్లేశ్వరుడు నిర్మాతలు. తాజాగా ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమి మాట్లాడుతూ ‘నా స్నేహితుల జీవితాల్లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించా. ప్రస్తుత సమాజంలోని రిలేషన్‌‌షిప్స్, లవ్ స్టోరీస్, ఘోస్టింగ్ వంటి అంశాలను ఇందులో  చూపించబోతున్నాం.  

ముఖ్యంగా యూత్‌‌కు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. డార్క్ కామెడీ, ఫ్రెండ్‌‌షిప్,  ఎమోషన్స్, లవ్ స్టోరీతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ఇతర నటీనటులు తెలియజేశారు.  కర్నూల్ నేపథ్యంలో స్థానిక యాస, స్లాంగ్‌‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అందరూ కొత్తవారే నటించారు. తన కొడుకు టాలెంట్‌‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానని, లాభనష్టాల కంటే అతడి ప్రతిభ ప్రేక్షకులకు చేరడమే తన కోరికని నిర్మాత ఖుస్నుమ  తెలిపారు.