సత్యారెడ్డి దర్శకత్వంలో గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ బుద్ధ’. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇండియన్ లాంగ్వేజ్ పోస్టర్లను ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ప్రముఖ బౌద్ధ భిక్షువుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని చూసిన ఖర్గే చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు, నిర్మాణంపై పలు సూచనలు చేసి, టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది బుద్ధ జయంతి సందర్భంగా ఎక్కువ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు, బుద్ధుని పాత్రధారి సత్యారెడ్డి తెలిపారు. అమెరికా, థాయిలాండ్, శ్రీలంక సహా పలు బౌద్ధ దేశాల్లో ఈ చిత్రాన్ని షూటింగ్ చేసినట్టు తెలియజేశారు.
