పెదకాపు, నాగబంధం లాంటి చిత్రాలతో హీరోగా గుర్తింపును తెచ్చుకున్న విరాట్ కర్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘రుస్తుం’. డెబ్యూ డైరెక్టర్ కనిష్క గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక ఈ సినిమాకు అనౌన్స్ చేసిన ‘రుస్తుం’ టైటిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా టైటిల్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు అదే టైటిల్‌తో మేకర్స్ సరికొత్త విజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ అందించనున్నారు.
