- చేవెళ్ల పరిధి దేవుని ఎర్రవల్లి గేట్ వద్ద యాక్సిడెంట్
చేవెళ్ల, వెలుగు : ఎటువంటి ఇండికేటర్వేయకుండా రెడీమిక్స్లారీని డ్రైవర్ యూ టర్న్చేయడంతో వెనక బైక్‌పై వస్తున్న యువకులు లారీని ఢీకొట్టి దాని కింద పడి కన్నుమూశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లికి చెందిన కొనింటి వంశీ (19), కొనింటి గౌతమ్ (19) శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై చేవెళ్ల నుంచి తమ స్నేహితుడిని కలిసేందుకు శంకర్‌పల్లి వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో దేవుని ఎర్రవల్లి గేట్ వద్దకు రాగానే, ముందు వెళ్తున్న రెడ్‌మిక్స్ లారీ డ్రైవర్ ఇండికేటర్ వేయకుండా యూ టర్న్తీసుకున్నాడు. దీంతో వెనుక బైక్‌పై వస్తున్న యువకులు అదుపుతప్పి ఢీకొట్టి లారీ కింద పడిపోయారు.
లారీ ముందు చక్రాలు పై నుంచి వెళ్లడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. గౌతమ్ చేవెళ్లలోని బైక్ జోన్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా, వంశీ ఇంటర్సెకండియర్చదువుతున్నట్టు తెలిసింది. మృతుడు వంశీ తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన రెడ్‌మిక్స్ లారీ డ్రైవర్, ఎంపీకి చెందిన బల్మిక్ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
