చార్మినార్, వెలుగు: బండ్లగూడ పీఎస్పరిధిలో యూజ్డ్కార్ల వ్యాపారి మహమ్మద్ అబ్దుల్ రహీమ్ (45) ను గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి తలపై సుత్తెతో కొట్టి చంపేశాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు బండ్లగూడ అబూ బాకర్కాలనీలోని ఇంట్లో అబ్దుల్రహీమ్పడుకుని ఉన్నాడు. తలుపులు కొడుతున్న శబ్దం రావడంతో రహీమ్భార్య షిరీన్ సుల్తానా వెళ్లి తీసింది. వెంటనే రహీమ్ గురించి అడిగి, ఆమెను నెట్టేస్తూ సరాసరి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. అక్కడ నిద్రపోతున్న రహీమ్తలపై సుత్తెతో కొట్టి చంపేశాడు.
అరుపులు విన్న రహీమ్ భార్య సమీపంలోనే ఉండే తన సోదరుడికి ఫోన్ చేసి పిలిచింది. ఆయన వచ్చి తలుపు పగలగొట్టి చూడగా రహీమ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. నిందితుడు వేరే డోర్నుంచి పరారయ్యాడు. పాత కార్ల వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆర్థిక వివాదాలు లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండ్ల గూడ ఇన్స్పెక్టర్ దేవేందర్, రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు..
